News February 9, 2025
ముధోల్: ఇంటి నిర్మాణాల తవ్వకాల్లో పురాతన నాణేలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739019692392_9539271-normal-WIFI.webp)
ముధోల్ మహాలక్ష్మిగల్లీకి చెందిన లూటే మారుతి పటేల్ ఇంటిని నిర్మాణ పనులను శుక్రవారం చేపట్టారు. పిల్లర్ కోసం తవ్వుతుండగా మట్టి కుండలో 92 అతి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సంజీవ్, తహశీల్దార్ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని చేరుకొని తవ్వకాల్లో బయటపడ్డ నాణేలను పరిశీలించారు. నాణేలను జిల్లా ఖజానా కార్యాలయంలో జమ చేస్తున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు.
Similar News
News February 9, 2025
నెల్లూరులో యువకుడి దారుణ హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739064447181_1106-normal-WIFI.webp)
నెల్లూరు నగరంలో శనివారం దారుణ హత్య జరిగింది. నవాబుపేట PS పరిధిలోని ఉడ్ హౌస్ ప్రాంతానికి చెందిన కోడూరు కళ్యాణ్ అలియాస్ చిన్నాపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిపై నవాబుపేట PSలో సస్పెక్ట్ రౌడీ షీటర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. DSP సింధుప్రియా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 9, 2025
ఆ ఫోన్ నంబర్లు వస్తే ఫోన్ ఎత్తకండి: సీఐ రమేశ్ బాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739032321518_51150652-normal-WIFI.webp)
ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90, #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్‌ని వారు యాక్టివేట్ చేసుకుని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని త్రీ టౌన్ సీఐ రమేశ్ బాబు తెలిపారు. అట్లాగే +3, +5, +9, +2 సిరీస్‌తో వచ్చే ఫోన్ నంబర్లను అస్సలు లిఫ్ట్ చేయవద్దని సూచించారు. మిస్డ్ కాల్ వచ్చిందని ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మూడు సెకన్లలో ఫోన్‌లో ఉన్న డేటాను హ్యాక్ చేస్తారని తెలిపారు.
News February 9, 2025
భువనగిరిలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739036106204_52242460-normal-WIFI.webp)
భువనగిరిలో ప్రజలకు పోలీసుల సేవలు మరింత చేరువ కావాలన్న ఆలోచనతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని హనుమన్వాడ, సంజీవ్ నగర్, పహాడీ నగర్లలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు సీఐ సురేశ్ కుమార్ తెలిపారు. పోలీసులు ప్రజలకు అందించే సేవలను వివరించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.