News December 17, 2025

ముధోల్: కెమికల్‌తో సిరా తొలగిస్తూ పట్టుబడ్డ యువకుడు

image

ముధోల్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద సిరా తొలగిస్తున్న యువకుడిని ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్నారు. నయాబాదికి చెందిన ఆర్బాజుద్దీన్ ఓటు వేసి వచ్చిన మహిళల వేలిపై ఉన్న సిరా గుర్తును కెమికల్‌తో తొలగిస్తుండగా పోలీసులు గమనించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, కెమికల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగ ఓట్లకు పాల్పడే ప్రయత్నంగా భావిస్తూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Similar News

News December 26, 2025

నటి మీనా కూతురిని చూశారా?

image

క్రిస్మస్ సందర్భంగా సీనియర్ నటి మీనా తన కూతురు నైనికతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నైనిక ఐదేళ్ల వయసులోనే దళపతి విజయ్ ‘తేరీ’ సినిమాలో బాలనటిగా కనిపించారు. ఆ సినిమా అనంతరం నటనకు బై చెప్పి చదువుపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఆమె వయసు 14 ఏళ్లు. లేటెస్ట్ ఫొటోలు చూసిన నెటిజన్లు ఇండస్ట్రీలోకి తిరిగి రావాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా మీనా భర్త 2022లో మరణించారు.

News December 26, 2025

ఖమ్మం: మున్నేరులో బాలిక మృతదేహం

image

ఖమ్మం నగర సమీపంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వాగులో బాలిక మృతదేహం లభ్యమైంది. నీటిలో తేలుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ బాలిక ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చింది? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

News December 26, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నగదు కొరత

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బ్యాంకుల్లో నగదు కొరతతో ఆసరా లబ్ధిదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నవంబర్ నెలకు సంబంధించి 4 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.90 కోట్ల నగదు ప్రభుత్వం జమ చేసింది. విత్ డ్రా చేసేందుకు పోస్టాఫీస్‌, బ్యాంకులు వెళ్తున్న లబ్ధిదారులు నిరాశతో వెనుతిగుతున్నారు. RBI వద్ద నగదు కొరత, వరుస సెలవుల కారణంగా ఈ సమస్య నెలకొంది. కలెక్టర్లు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.