News August 15, 2024

ముధోల్: నాలుగు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడు

image

మండలంలోని కారేగాం గ్రామానికి చెందిన రైతు దూసముడి రాములు-లక్ష్మి దంపతుల కుమారుడు ప్రశాంత్ కుమార్ ఇటీవల TGPSC విడుదల చేసిన సివిల్ ఇంజినీరింగ్ AEE ఫలితాలలో మిషన్ భగీరథ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని సాధించాడు. అలాగే AE, TPBO, TO(Ground Water dept) మెరిట్ అర్హతను సాధించాడు. 10th వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతడు KUలో BTech, JNTUHలో MTech పూర్తిచేశాడు.

Similar News

News November 12, 2025

ఆదిలాబాద్‌లో JOBS.. అప్లై NOW

image

ఆదిలాబాద్‌ జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (KGBV), అనుబంధ మోడల్ స్కూళ్లలో బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టే ఈ నియామకాలకు స్థానిక మండలానికి చెందిన 18-45 ఏళ్ల వారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా అర్హులు మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 12, 2025

ADB: పాఠశాల మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం అర్బన్, రూరల్, మావల, ఇచ్చోడ మండలాల్లోని పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడలు సహా తరగతి గదుల మరమ్మత్తులపై చర్చించి, పనుల్లో జాప్యం చేయవద్దని సూచించారు.

News November 11, 2025

సజావుగా సాగుతున్న పంటల కొనుగోళ్ల: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభమై కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వరి, పత్తి, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు కలిసి నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 11 పత్తి కొనుగోలు కేంద్రాలు, 33 జిన్నింగ్ మిల్లులు ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు.