News December 12, 2025
మునగాకుతో ఎన్నో లాభాలు

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Similar News
News December 15, 2025
ధరలు మార్చకుండా ప్రయోజనాలు తగ్గించిన AIRTEL

ఎయిర్‌టెల్ తన అన్‌లిమిటెడ్ 5G బూస్టర్ ప్యాక్‌ల డేటా ప్రయోజనాలను గణనీయంగా తగ్గించింది. ₹51, ₹101, ₹151 ప్యాక్‌లపై గతంలో లభించిన 3GB, 6GB,9GB డేటా ఇప్పుడు 1GB, 2GB,3GBకు తగ్గించింది. ధరలు మారనప్పటికీ డేటా తగ్గడంతో వినియోగదారులకు నష్టం కలగనుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ ప్యాక్‌ల ప్రయోజనాలనూ ఇలానే తగ్గించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
News December 15, 2025
మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.
News December 15, 2025
వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌తో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది

మహిళల్లో వైట్ డిశ్చార్జ్ రంగు మారినా, వెజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. దాంతో పిండం గర్భాశయంలోకి వెళ్లదు. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని గుర్తించకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


