News April 18, 2025
మునగ సాగు రైతుకు కొత్తగూడెం కలెక్టర్ సత్కారం

పినపాక మండలం ఏల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు కొప్పుల వర్మ ఈ బయ్యారం క్రాస్ రోడ్డులో సాగు చేస్తున్న మునగ తోటను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. మునగ తోట పెంచడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ రైతులకు సూచించారు. రైతుల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వపరంగా ఆదుకుంటామని అభయమిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో సునీల్ కుమార్, వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News April 19, 2025
10 రోజుల్లో రూ.4,200 పెరిగిన గోల్డ్ రేటు

శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గత పది రోజుల్లోనే తులం బంగారంపై రూ.4,200లు పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. అయితే, మూడు రోజులకే టారిఫ్స్ హోల్డ్ చేయడంతో రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఈనెల 10న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,380 ఉండగా ఇవాళ అది రూ.97,580కి చేరింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.89,450గా ఉంది.
News April 19, 2025
కొల్లాపూర్‌లో ప్రజల నుంచి వినతుల స్వీకరించిన మంత్రి

కొల్లాపూర్ పట్టణంలోని కేఎల్ఐ గెస్ట్ హౌస్‌లో శనివారం ఉదయం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి జూపల్లి వినతులు స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు సమస్యలతో వచ్చినప్పుడు అధికారులు పరిష్కరించాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరగొద్దన్నారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News April 19, 2025
పెళ్లిపై నాకు నమ్మకం లేదు: త్రిష

వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని హీరోయిన్ త్రిష అన్నారు. పెళ్లి అయినా, కాకపోయినా తనకు ఫరవాలేదని ఆమె తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. కాగా త్రిష ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’లోనూ ఆమె కనిపించనున్నారు.