News September 9, 2025
మునిపల్లి: పాఠశాల స్థలాన్ని పరిశీలించిన మంత్రి

మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు హాస్టల్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడిన ఘటన ప్రదేశాన్ని మంత్రి దామోదర రాజనర్సింహా పరిశీలించారు. ఘటనపై అధికారులతో మంత్రి చర్చించారు. హాస్టల్‌లోని మిగిలిన భవనాల స్టాండర్డ్స్‌ను పరిశీలించి ఉపయోగానికి, పనికిరాని వాటిని బ్లాక్ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
Similar News
News September 10, 2025
లివర్ బాధితులకు నిమ్స్ భరోసా.. త్వరలో అత్యాధునిక చికిత్స

కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారికి నిమ్స్ ఆస్పత్రి భరోసా ఇస్తోంది. త్వరలో అత్యాధునిక ఇంజెక్షన్‌ను అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 2 నుంచి ఇది పేషెంట్లకు అందుబాటులో ఉంటుందని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా కేవలం రీజనరేటివ్ మెడిసిన్‌తో లివర్ పనితీరును మెరుగుపరచవచ్చని డైరెక్టర్ తెలిపారు.
News September 10, 2025
ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల ధరలు ఇవే

ఐఫోన్ <<17663695>>17 సిరీస్<<>> మోడల్ ఫోన్లు ఈ నెల 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి. భారత్‌లో వీటి ప్రారంభ ధరలు (256gb) ఇలా ఉన్నాయి.
ఐఫోన్ 17: ₹82,900
ఐఫోన్ 17 ఎయిర్: ₹1,19,900
ఐఫోన్ 17 ప్రో: ₹1,34,900
ఐఫోన్ 17 ప్రో మాక్స్: ₹1,49,900
News September 10, 2025
అనకాపల్లి: ‘పాడైపోయిన ఐరన్ వస్తువులకు వేలం’

పాడైపోయిన ఐరన్ వస్తువులకు విశాఖ కైలాసగిరి ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈనెల 11న ఉదయం 10 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. వేలం పాటలో పాల్గొనేవారు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు రూ.500 డిపాజిట్ చెల్లించాలన్నారు. వేలం పాటను ఖరారు చేసుకున్నవారు అక్కడికక్కడే నగదు చెల్లించాలన్నారు. దీనికి 18 శాతం జీఎస్టీతో పాటు 12% ఇతర ఛార్జీలు అదనంగా చెల్లించాలన్నారు.