News August 20, 2025

మున్నేరుకు స్వల్పంగా పెరిగిన నీటిమట్టం

image

ఖమ్మం మున్నేరుకు వరద స్వల్పంగా పెరిగింది. సోమవారం 8 అడుగులకు తగ్గిన నీటిమట్టం, బుధవారం ఉదయం 10.50 అడుగులకు చేరింది. ప్రస్తుతం మున్నేరులో 30 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Similar News

News August 20, 2025

ప్రణాళికాబద్ధంగా భూ సేకరణ పూర్తి చేయాలి: అ.కలెక్టర్

image

నీటిపారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి నీటి పారుదల ప్రాజెక్టుల భూ సేకరణపై సమీక్షించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో వివిధ ప్యాకేజీలలో మొత్తం 3,778 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,964 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశామన్నారు.

News August 20, 2025

వైరా రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వైరాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మత్స్య విత్తన అభివృద్ధి శాఖ కార్యాలయం, వైరా రిజర్వాయర్‌లను పరిశీలించారు. ఆయన రిజర్వాయర్ నీటిమట్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేపల పెంపకం, దిగుబడిపై మత్స్య శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ వర్షాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News August 20, 2025

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం: సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 75 డెంగ్యూ కేసులు నమోదు కాగా, 52 కేసులు కోలుకున్నాయని, 23 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని చెప్పారు. పాజిటివ్ కేసులు వచ్చిన ఇళ్లు, పరిసర 60 ఇండ్లలో ఫీవర్ సర్వే, యాంటీ లార్వా చర్యలు చేపట్టాలన్నారు. లక్షణాలున్న వారికి వెంటనే పరీక్షలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.