News September 8, 2025
మున్నేరులో యువకుల గల్లంతు.. ఒకరి మృతి

కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కోసం మున్నేరుకు వెళ్లిన నలుగురు యువకుల్లో ఇద్దరు సోమవారం గల్లంతయ్యారు. వీరిలో కుద్దుస్ మృతదేహం లభ్యం కాగా, ఫారూక్ అనే మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News September 9, 2025
ముమ్మిడివరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ముమ్మిడివరం మండలం ఠాణేలంక వెళ్లే ప్రధాన రహదారిపై రాజుపాలెం వద్ద కొబ్బరి డొక్కలలోడుతో వెళ్తున్న హైచర్ లారీ కింద పడి వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. ముందుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో బైక్ అదుపుతప్పి లారీ కింద పడినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు కూనలంక గ్రామానికి చెందిన కొప్పిశెట్టి గంగరాజు (46)గా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 9, 2025
బడ్జెట్ తక్కువ.. లాభాలెక్కువ!

ఈ ఏడాది రిలీజైన లోబడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (₹50 కోట్లు) రూ.303 కోట్లు రాబట్టింది. ‘మహావతార్ నరసింహ’(₹15Cr) చిత్రం రూ.315కోట్లు, అహాన్ పాండే ‘సైయారా’ మూవీ (₹40Cr) రూ.569+ కోట్లు కలెక్ట్ చేశాయి. అలాగే మోహన్ లాల్ ‘తుడరుమ్’(₹35కోట్లు)కు రూ.235కోట్లు, దుల్కర్ నిర్మించిన ‘కొత్త లోక’ (₹30Cr) మూవీకి రూ.185+కోట్లు వచ్చాయి. ఇందులో మీకేది నచ్చింది?
News September 9, 2025
ALERT: ఈ నెల 15 వరకు భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, HYD, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, NZB, పెద్దపల్లి, సిరిసిల్ల, RR, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, WGL, భువనగిరి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వానలు పడతాయని అంచనా వేసింది.