News February 10, 2026
మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 106 వార్డులు ఉండగా 1,85,348 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు 1,34,775 మంది, అశ్వారావుపేట 22 వార్డులు 16,850 మంది, ఇల్లందు 24 వార్డులు 33,723 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.
Similar News
News February 19, 2026
తిరుపతి: రైతులకు ఇక మరింత సులభంగా.!

రైతులు పండించే పంటలను రైతే ఫోన్ ద్వారా e-crop నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. APAIMS యాప్ ద్వారా ఆధార్ నంబర్, MPINతో లాగిన్ చేసుకోవాలి. వారి భూమికి సంబంధించిన ఫొటోలను జియో కోఆర్డినేట్స్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. ఇలా ఫోన్‌లో చేసిన వాటిని సంబంధిత అధికారులు ధృవీకరిస్తారు. జిల్లాలో 14వేల మంది రైతులు ఫోన్‌లోనే ఈ-క్రాప్ నమోదు చేసుకున్నారు.
News February 19, 2026
HYD: EAPCETకి 3,385 అప్లికేషన్స్

TG EAPCET ప్రవేశ పరీక్షకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలకు సంబంధించి 1,430 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,950 మంది అప్లై చేయగా 2 విభాగాలకు 5 మంది దరఖాస్తు చేసుకోవడంతో 3,385 అప్లికేషన్ వచ్చాయని TG EAPCET కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి JNTUHలో వెల్లడించారు.
News February 19, 2026
ఖమ్మం: రిటైర్మెంట్ బకాయిలు అందక విశ్రాంత ఏఆర్‌ఎస్‌ఐ మృతి

ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో 35 ఏళ్లు సేవలందించి 2025 ఫిబ్రవరిలో రిటైరైన ఏఆర్‌ఎస్‌ఐ కే.మైసయ్య కన్నుమూశారు. రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేక ఆయన మరణించడం విషాదం నింపింది. విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేసింది. బకాయిల విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు.


