News February 20, 2026
మున్సిపల్ ఎన్నికలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి: హరీశ్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. క్యాతన్పల్లిలో BRS కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళా కౌన్సిలర్‌పై దాడులు చేసిన తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం విడ్డూరమని ఆక్షేపించారు. క్యాతన్‌పల్లి ఇన్సిడెంట్ పై గవర్నర్ స్పందించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 24, 2026
ఇంటర్ ఎగ్జామ్స్.. సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!

TG: రేపటి నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు 8:30AMలోపు సెంటర్‌కు చేరుకోవాలి. HYD వంటి నగరాల్లో ట్రాఫిక్ కారణంగా సెంటర్‌కు సమయానికి చేరుకోలేకపోవచ్చు. దానికి తగ్గట్లుగా ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోండి. సెంటర్ అడ్రస్ కోసం హాల్‌టికెట్లపై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేస్తే డైరెక్ట్ మ్యాప్‌లో ఓపెన్ అవుతుంది. ఇంటర్ విద్యార్థులున్న తల్లిదండ్రులకు షేర్ చేయండి.
News February 24, 2026
జిల్లాలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హరిత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో 9,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.
News February 24, 2026
ADB: 108 సిబ్బంది సేవలు అభినందనీయం

ఆపద సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా 108, 102 ఉత్తమ సేవల్లో హైలెట్ బెస్ట్ ఈఎంటీ, పైలట్ అవార్డులను మంగళవారం కలెక్టర్ అందజేశారు. ఈఎంటీ రేఖ, రాజేశ్వర్, పైలట్ శివకుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా కోఆర్డినేటర్ శేఖర్, మనోహర్ వసీం పాల్గొన్నారు.


