News February 7, 2026

మున్సిపల్ ఎన్నికలు.. ఖమ్మం సీపీ హెచ్చరిక

image

ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 9 నుంచి 13 వరకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో BNSS 163 అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఐదుగురికి మించి గుంపులుగా చేరడం, ఊరేగింపులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిషేధమన్నారు. డబ్బు, మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 7, 2026

ఖమ్మం: రేపే పోస్టల్ బ్యాలెట్ వినియోగం

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. ఖమ్మం రూరల్, మధిర MPDO కార్యాలయాలు, వైరా MRO కార్యాలయం, సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News February 7, 2026

మున్సిపల్ ఎన్నికల నగారా.. పటిష్ఠ నిఘా

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎన్నికల అధికారిగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News February 7, 2026

ఖమ్మం: జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో 2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రస్తుత కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనుందని, అర్హులు I&PRవెబ్‌సైట్ ద్వారా ఈ నెల 9 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీడియా యాజమాన్యాలు తమ ప్రతినిధుల జాబితాను డీపీఆర్వో కార్యాలయంలో సమర్పించాలని కోరారు.