News January 15, 2026
మున్సిపల్ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు

TG: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో జనరల్ 30, జనరల్ మహిళ 31, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19, ఎస్సీ జనరల్ 9, SC మహిళ 8, ఎస్టీ జనరల్ 3, ST మహిళలకు 2 స్థానాలు కేటాయించింది. 10 కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళ 4, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, ఎస్సీ 1, ఎస్టీకి ఒక స్థానంలో కేటాయింపులు చేసింది. ఈ నెల 17లోపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది.
Similar News
News February 7, 2026
అర్ధరాత్రి బిహార్ ఎంపీ అరెస్ట్

నాటకీయ పరిణామాల నడుమ బిహార్ ఎంపీ పప్పూ యాదవ్(రాజేశ్ రంజన్) అరెస్టయ్యారు. 1995 డాక్యుమెంట్ ఫోర్జరీ కేసులో ఆయనను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయన పోలీసులతో అరెస్టుకు వారెంట్ లేదని వాగ్వాదానికి దిగారు. ఇవాళ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఢిల్లీ నుంచి పాట్నాలోని ఇంటికి చేరిన గంటలోపే పప్పూను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్ణియా లోక్‌సభ నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
News February 7, 2026
బాలీవుడ్‌లో 90% పెళ్లిళ్లు ఫేక్: ‘హిట్-3’ నటుడు

బాలీవుడ్‌లో 90శాతం పెళ్లిళ్లు ఫేక్ అని ‘హిట్-3’ నటుడు ప్రతీక్ స్మిత పాటిల్ అన్నారు. ‘ప్రజలకు వాస్తవం ఏంటో తెలియదు. ఇండస్ట్రీలోని వారికే నిజాలు తెలుసు. ఏదో ఒక రోజు ఈ అంశాలు కథగా లేదా పుస్తక రూపంలో లేదా సినిమాగా రావచ్చు. ఒకరినొకరు మోసగించుకోవడం, పలువురితో సంబంధం కలిగి ఉండటం ఇక్కడ ఫ్యాషన్‌గా మారింది. పెళ్లి అంటే ఒక జోక్ అయింది’ అని భార్య ప్రియా బెనర్జీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News February 7, 2026
ఫిబ్రవరి 07: చరిత్రలో ఈరోజు

* 1888: రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం * 1969: సమరయోధుడు ఆమంచర్ల గోపాలరావు మరణం * 1937: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలిహు రూట్ మరణం * 1990: కేంద్ర మాజీ మంత్రి మల్లు అనంత రాములు మరణం * 2008: హాస్యనటుడు లక్ష్మీపతి మరణం * 2018: మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం (ఫొటోలో)


