News October 19, 2025
మున్సిపల్ కమిషనర్‌గా మోత్కూరు యువకుడు

పట్టుదల, కృషికి ఫలితం దక్కింది. మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణరెడ్డి గ్రూప్-2 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ‘కొలువుల పండుగ’లో CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ నియామక పత్రాన్ని అందుకున్నారు.
Similar News
News October 19, 2025
24 ఏళ్ల యువతితో 74 ఏళ్ల తాత పెళ్లి.. ₹2 కోట్ల ఎదురుకట్నం!

ఇండోనేషియాలో తన కన్నా 50 ఏళ్లు చిన్నదైన యువతి(24)ని పెళ్లాడాడో వృద్ధుడు (74). ఇందుకోసం ₹2 కోట్ల ఎదురుకట్నం చెల్లించాడు. తూర్పు జావాలో ఈ నెల 1న అరికాను టార్మాన్ పెళ్లి చేసుకున్నాడు. తొలుత ₹60 లక్షలు ఇస్తామని, తర్వాత ₹1.8 కోట్లు అందజేశాడు. అతిథులకు ₹6 వేల చొప్పున గిఫ్ట్‌గా ఇచ్చాడు. కానీ ఫొటోగ్రాఫర్‌కు డబ్బులివ్వకుండా ‘నవ దంపతులు’ అదృశ్యమయ్యారు. అయితే వారు హనీమూన్‌కు వెళ్లారని ఫ్యామిలీ చెబుతోంది.
News October 19, 2025
జూరాలకు తగ్గిన వరద

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను నిలిపివేయడంతో ఆదివారం సాయంత్రం జూరాలకు 28 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లను మూసివేశారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి, వివిధ కాలువల ద్వారా మొత్తం 32,362 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News October 19, 2025
NZB: పోలీసులకు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ

విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్‌పై దాడి చేసి చంపిన రియాజ్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పోలీసులకు మద్దతుగా అభినందనల వెల్లువెత్తాయి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి సీపీ సాయి చైతన్య నాయకత్వంలో 9 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు ఆదివారం పోలీసులకు చిక్కాడు. నిందుతుడిని ఎన్ కౌంటర్ చేయాలని సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయపడుతున్నారు.