News February 12, 2026

మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్ తేజస్

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం సిద్ధమైందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు శిక్షణ ఇచ్చారు. సీసీ కెమెరాల నిఘాలో పారదర్శకంగా కౌంటింగ్ జరుగుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏజెంట్ల సమక్షంలోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

Similar News

News February 21, 2026

కొత్తగూడెం: ఆళ్లపల్లి అడవుల్లో పులి సంచారం

image

ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రేగళ్ల రేంజ్ నుంచి ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పాదముద్రలను సేకరిస్తున్నారు. పులి సంచారాన్ని అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రజలు ఒంటరిగా వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News February 21, 2026

ప.గో: శ్రీవారి ఫొటోలతో ప్లకార్డులు.. MLA నాయకర్ ఫైర్

image

శాసన మండలిలో YCP ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన YCPకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానిస్తూ పాపానికి ఒడిగట్టారని మండిపడ్డారు.

News February 21, 2026

SRD: భయంగా ఉంది. చనిపోతాను: RTC డ్రైవర్

image

ఖేడ్ RTC డిపో డ్రైవర్ పాపయ్య అదృశ్యమైనట్లు హద్నూర్ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆయన బైక్‌పై వెళ్తూ కూతురుతో వీడియో కాల్ చేసి మాట్లాడుతూ.. భయంగా ఉంది. చనిపోతాను.. మీరంతా బాగుండాలని ఫోన్ కట్ చేసి మంజీరా నదిలో దూకినట్లు సమాచారం. ఘటన స్థలంలో పాపయ్యకు సంబంధించి వస్తువులు, బైకు, సెల్‌ఫోన్ గుర్తించి హద్నూర్ పోలీసులకు సమాచారమివ్వగా గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. మిస్సింగ్ కేసుతో దర్యాప్తు చేస్తున్నారు.