News February 13, 2026

మున్సిపాలిటీలో ‘హంగ్’ ఉత్కంఠ: కింగ్ మేకర్లుగా ఎక్స్-అఫీషియో ఓట్లు..!

image

అలంపూర్ పురపాలక ఎన్నికల సమరం ముగిసింది, కానీ అసలు సిసలైన రాజకీయ చదరంగం ఇప్పుడే మొదలైంది. ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడి, ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఛైర్మన్ ఎన్నికలో నిర్ణయాత్మక శక్తిగా మారనున్న ఎక్స్-అఫీషియో ఓట్లు ప్రస్తుతం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఆ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులు ఉన్నాయి.

Similar News

News February 13, 2026

ఎంజీయూ B.Ed ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఎంజీయూ పరిధిలోని B.Ed సెమిస్టర్-3 రెగ్యులర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షల కోసం ఎగ్జామినర్ల జాబితాను యూనివర్సిటీ ప్రకటించింది. ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-A కాలేజీలకు, 19, 20 తేదీల్లో గ్రూప్-B కాలేజీలకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.

News February 13, 2026

వాలంటైన్స్ డే.. ఆ లింక్‌లపై క్లిక్ చేయొద్దు!

image

TG: వాలంటైన్స్ డే సందర్భంగా సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. నకిలీ డేటింగ్ ప్రొఫైళ్లు, గిఫ్ట్ ఆఫర్లు, పూల డెలివరీ, డిస్కౌంట్‌ల పేరిట లింక్‌లు వస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వాటిపై క్లిక్ చేస్తే నకిలీ పేమెంట్ వెబ్ సైట్లు, యాప్స్ డౌన్‌లోడ్ అయి డబ్బు మాయమవుతాయని తెలిపారు. అటు OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొన్నారు.

News February 13, 2026

ప్రశాంతంగా కౌంటింగ్ పూర్తి: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసి మొత్తం ప్రక్రియను సాఫీగా పూర్తి చేశారని అభినందించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించడం వలన కౌంటింగ్ విజయవంతమైందన్నారు.