News December 31, 2025

మున్సిపాలిటీల గ్రేడ్ పెరిగితే ఏమవుతుందో తెలుసా?

image

AP: EGDt జిల్లా కొవ్వూరు, WGDt జిల్లా తణుకు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీల గ్రేడ్ పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్-1లో ఉన్న తణుకు, గ్రేడ్-2లోని కదిరి మున్సిపాలిటీలను సెలక్షన్ గ్రేడ్‌కు, గ్రేడ్-3లో ఉన్న కొవ్వూరును గ్రేడ్-1కు పెంచింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, కేటాయించే బడ్జెట్ పెరుగుతుంది. రోడ్లు, నీరు, శానిటేషన్ వసతులు మెరుగవుతాయి.

Similar News

News February 17, 2026

కనిపించిన నెలవంక.. రేపటి నుంచే రంజాన్

image

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపు ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు. రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే.

News February 17, 2026

బంగ్లా క్యాబినెట్‌లో ఏకైక హిందూ మంత్రి.. నితాయ్ రాయ్ చౌధరీ!

image

బంగ్లా కొత్త ప్రధాని తారిఖ్ రెహమాన్ మంత్రివర్గంలో హిందూ సామాజిక వర్గానికి చెందిన నితాయ్ రాయ్ చౌధరీకి స్థానం దక్కింది. ఆయన సాంస్కృతిక శాఖ బాధ్యతలు చేపట్టారు. మాగురా-2 నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన రాయ్ వృత్తిరీత్యా లాయర్. BNP వైస్ ఛైర్మన్లలో ఒకరు. 1990లో హుస్సేన్ ఎర్షద్ ప్రభుత్వంలోనూ మంత్రిగా చేశారు. హిందువులపై దాడుల నేపథ్యంలో మంత్రివర్గంలో ఆయన చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

News February 17, 2026

పాకిస్థాన్‌కు ‘రావి’ షాక్: ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్!

image

వేసవి వేళ పాక్‌కు భారత్ షాకివ్వనుంది. రావి నదిపై నిర్మిస్తున్న షాపూర్ కండి బ్యారేజ్ మార్చి 31 నాటికి పూర్తి కానుంది. దీంతో ఏప్రిల్ నుంచి పాక్‌కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా నిలిపేయనున్నట్లు JK మంత్రి జావెద్ అహ్మద్ ప్రకటించారు. 1960 ఒప్పందం ప్రకారం ఈ నదిపై భారత్‌కే పూర్తి హక్కులు ఉన్నా ఇన్నాళ్లూ ప్రాజెక్టుల్లేక నీరు వృథాగా పాక్‌కు వెళ్లేది. ఇకపై ఆ నీటితో JK, పంజాబ్‌లకు సాగునీరు అందనుంది.