News January 13, 2026
మున్సిపాలిటీ ఓటర్లు.. అత్యధికం ఎక్కడంటే?

TG: రాష్ట్రంలో మొత్తం 123 మున్సిపాలిటీల్లో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. ఈ మున్సిపాలిటీల్లో మొత్తం 2,996 వార్డులుండగా 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల పరంగా అత్యధికంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 3,48,051, అత్యల్పంగా వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీలో 9,147 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 123 మున్సిపాలిటీల్లో 113 చోట్ల మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.
Similar News
News February 11, 2026
జైలులో గాంధీ మార్గం.. అత్యాచార నిందితుడికి శిక్షాకాలం తగ్గింపు!

అత్యాచార నిందితుడి జీవిత ఖైదును ముంబై హైకోర్టు 12 ఏళ్లకు తగ్గించింది. జైలులో అతడు గాంధీ ఆలోచనలపై పరీక్షలు రాయడం, వ్యాస రచన వంటి విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని అతనిలో వచ్చిన ‘మార్పు’గా గుర్తించింది. 2016లో ఐదేళ్ల బాలికపై జరిగిన రేప్ కేసులో ఈ నిందితుడి వయసు (నేరం జరిగినప్పుడు 20 ఏళ్లు), పదేళ్లుగా బెయిల్ లేకుండా జైలులో ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్షను తగ్గిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
News February 11, 2026
800లకు ఒక్క మార్కు.. అయినా MS ఆర్థోపెడిక్స్ సీటు!

NEET PGలో 800 మార్కులకు గానూ కేవలం ఒక్క మార్కు సాధించిన అభ్యర్థికి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో MS ఆర్థోపెడిక్స్ సీటు లభించింది. కటాఫ్ పర్సంటైల్‌ను సున్నాకు తగ్గించడంతో సింగిల్ డిజిట్ మార్కులు వచ్చిన 20 మందికి ఉస్మానియా, గాంధీ, కాకతీయ వంటి ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో సీట్లు దక్కాయి. టాప్ ర్యాంకర్లు ఎంచుకునే కోర్సులు సైతం 100లోపు మార్కులు వచ్చినవారికి దక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
News February 11, 2026
తమిళనాడులో సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటు: స్టాలిన్

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని DMK అధినేత, సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. 2021 కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుంటామని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుతో పోటీ చేస్తామని తెలిపారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీతో తనకు సోదర బంధం ఉందని పేర్కొన్నారు. అధికారాన్ని పంచుకోవడమనే ప్రశ్న ఇప్పుడు ముఖ్యం కాదన్నట్లుగా మాట్లాడారు.


