News January 28, 2026
మున్సి’పోల్స్’.. నేటి నుంచి నామినేషన్లు

TG: మున్సిపల్ ఎన్నికల <<18974641>>నామినేషన్ల<<>> ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 30 వరకు కొనసాగనుంది.
నామినేషన్‌కు కావాల్సినవి: నామినేషన్ ఫారం, పుట్టిన తేదీ ధ్రువీకరణ (SSC/ఓటర్ ఐడీ/ఆధార్ జిరాక్స్), కుల ధ్రువీకరణ పత్రం (రిజర్వుడు స్థానాల్లో), నామినేషన్ డిపాజిట్, సెల్ఫ్ అఫిడవిట్ (ఆస్తులు, విద్యార్హతలు, కేసులు), కొత్త బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, సెల్ఫ్ డిక్లరేషన్, ప్రాపర్టీ నో డ్యూ సర్టిఫికెట్, ఫొటోలు.
Similar News
News January 29, 2026
ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ గురించి తెలుసా?

ప్రెగ్నెన్సీలో మహిళలు మద్యం తాగడం వల్ల బిడ్డకు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీంతో శిశువుకు శారీరక, మానసిక లోపాలు ఏర్పడతాయంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకుంటే అది పిండంలోకి సులువుగా చేరుతుంది. కాలేయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆల్కహాల్ శిశువు శరీరంలో పేరుకుపోతుంది. దీంతో శిశువుకు పోషకాలు, ఆక్సిజన్ అందక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.
News January 29, 2026
నోటీసులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు: KTR

TG: KCRకు <<18992001>>నోటీసులు<<>> ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నోటీసులు ఇచ్చింది. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు’ అని ట్వీట్ చేశారు.
News January 29, 2026
AI షాక్: 2008 కంటే ఘోరమైన సంక్షోభం రాబోతుందా?

భవిష్యత్తులో కృత్రిమ మేధ (AI) వల్ల 2008 నాటి ఆర్థిక మాంద్యం కంటే దారుణమైన పరిస్థితులు రావొచ్చని 2025-26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. దీనికి అవకాశం తక్కువే ఉన్నా.. జరిగితే మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. ‘భారత్‌లోని IT రంగం, వైట్ కాలర్ ఉద్యోగాలకు AI పెద్ద ముప్పుగా మారనుంది. ఇప్పటికే IT రంగంలో వృద్ధి ఉన్నా దానికి తగ్గట్టుగా కొత్త ఉద్యోగాలు రావడం లేదు’ అని సర్వే పేర్కొంది.


