News February 8, 2026
మున్సి‘పోల్స్’ స్పెషల్: ఇంటికి కేజీ మటన్, చికెన్, రైస్

మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను ఆశిస్తున్న ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రకరకాల హామీలు ఇస్తున్నారు. రోజూ వాళ్లడిగిన మద్యం బ్రాండ్, యాట మాంసం సరఫరా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరో 2 రోజులే ఉండటం, నేడు ఆదివారం కావడంతో అభ్యర్థులు ఓటర్లకు ఇంటికీ కిలో మటన్, చికెన్ సహా ఓటర్ల సంఖ్యను బట్టీ బాస్మతి రైస్, మద్యం బాటిళ్లు పంపుతున్నారని టాక్. ఇంతకీ మీ ఇంటికి మాంసం కవర్ అందిందా? ఒట్టి మాటేనా?
Similar News
News February 8, 2026
హలీమ్ HYD ఎలా వచ్చిందంటే?

రంజాన్ మహినా షురూ అయిందంటే HYD షెహర్‌లో హలీం పరిమళాలు, దాని రుచితో మత్తెక్కిపోతుంది. పట్నంలో పొద్దుపోయినాక బట్టీల వద్ద హలీం లవర్స్ సందడి కనిపిస్తుంది. అయితే హలీమ్ అరబ్బుల వంటకం. నిజాం సైన్యంలో చేరిన అరబ్ సైనికులు, ఇక్కడ స్థిరపడిన పర్షియన్ల ద్వారా HYDకు పరిచయమైంది. 90 ఏళ్ల క్రితం పత్తర్‌గట్టిలోని మదీనా హోటల్ దీని రుచిని పట్నానికి పరిచయం చేసింది. ప్రజలు మెచ్చిన వంటకంగా 2010లో GI గుర్తింపు పొందింది.
News February 8, 2026
HYD: రూ.40K జీతంతో ఉద్యోగాలు

HYD ECILలో 18 పోస్టులను భర్తీ చేయనుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (పర్చేసింగ్)-C(18) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్‌లో 60% ఉత్తీర్ణతతో పాటు వృత్తిలో అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 20న ECILలో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. నెలకు 40,000 జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు <
News February 8, 2026
ఉప్పల్‌లో నేడు మెగా సెమినార్

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఉప్పల్ భగాయత్‌లోని SriRasthu Conventionలో నేడు ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు


