News February 18, 2025

ముప్కాల్: కాల్వలో పడి రైతు దుర్మరణం

image

ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన కోమటి శెట్టి చిన్నయ్య (46) అనే రైతు ప్రమాదవశాత్తు శ్రీరామ్ సాగర్ కాకతీయ కాల్వ లో పడి మృతి చెందినట్లు ఎస్ఐ రజినీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకతీయ కాల్వ మోటార్ ద్వారా తన చేనుకు నీరు అందించుకుంటున్నాడు. మోటర్‌లో నీరు తక్కువగా రావడంతో కాల్వలోకి దిగి నాచు తొలగించుతుండగా నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో కొట్టుకపోయాడు.

Similar News

News December 14, 2025

నిజామాబాద్‌లో రెండో విడత పోలింగ్ ప్రశాంతం

image

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ
ప్రశాంతంగా ముగిసింది. డిచ్‌పల్లి మండలంలో స్వల్ప ఘర్షణ జరిగినప్పటికీ పోలీసులు దాన్ని సమర్థవంతంగా నివారించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు శాంప్రసాద్ లాల్ ఎనిమిది మండలాల్లో తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలించారు.

News December 14, 2025

నిజామాబాద్: 1PM UPDATE 72.56 శాతం

image

రెండో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 72.56 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది….
* ధర్పల్లి మండలంలో 68.30%,
* డిచ్‌పల్లి-62.68%
* ఇందల్వాయి-75.29%
* జక్రాన్‌పల్లి-72.80%
* మాక్లూర్-76.66%
* మోపాల్- 78.95%
* NZB రూరల్-80.47%
* సిరికొండ-73.13% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News December 14, 2025

NZB: ఓటు హక్కు వినియోగించుకున్న BJP జిల్లా అధ్యక్షుడు

image

రెండో విడుత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత గ్రామమైన అమృతపూర్‌లో ఓటు వేశారు. దినేష్ కులాచారి మాట్లాడుతా.. ఈ రోజు నా సొంత గ్రామంలో ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామానికి సేవ చేసే వారికీ నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.