News December 20, 2025

ముమ్మరంగా ‘మాక్ డ్రిల్’ ఏర్పాట్లు: సూర్యాపేట కలెక్టర్

image

ఆకస్మిక వరదలు, అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 22న కోదాడలోని షిరిడి సాయి నగర్‌లో ‘మాక్ డ్రిల్’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం ఎస్పీ నరసింహతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం జరగకుండా వేగంగా స్పందించేందుకు ఈ కసరత్తు దోహదపడుతుందన్నారు.

Similar News

News December 22, 2025

బీజేపీతోనే సుపరిపాలన సాధ్యం: MP పురందీశ్వరి

image

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని MP పురందీశ్వరి అన్నారు. అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా సోమవారం రాజమండ్రిలోని తన కార్యాలయం వద్ద ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా సుపరిపాలన అందుతోందని పేర్కొన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

News December 22, 2025

VJA: GGHలో దందా.. రోగిని తీసుకెళ్లాలంటే లంచం ఇవ్వాల్సిందే.!

image

విజయవాడలోని కొత్త,పాత GGHలలో రోగులను వార్డుల్లోకి తరలించే సిబ్బందికి డబ్బులిస్తే కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. క్యాజువాలిటీ నుంచి ఇతర వార్డుల్లోకి మార్చాలంటే రూ.200పైగా వసూలు చేస్తున్నారు. ఇటీవల కృష్ణా(D) కోడూరుకి చెందిన ఓ వ్యక్తి GGHలో మృతిచెందగా వార్డులోంచి పక్కనే ఉన్న మార్చురీకి తరలించేందుకు రూ.1000 డిమాండ్ చేశారు. లంచాలు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

News December 22, 2025

కరీంనగర్: గ్రామపాలకులు ఈ ‘మహాలక్ష్ములు’..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు సాగుతున్నాయి. చాలాచోట్ల మహిళలు అభ్యర్థులుగా నిలిచి విజయం సాధించారు. నేడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వీరంతా ‘మహాలక్ష్ములు’గా పట్టుచీరలు కట్టుకుని ఆయా జీపీలకు వచ్చారు. వీరితో స్పెషల్ ఆఫీసర్లు ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. కాగా, తమ గ్రామాలను సాక్షాత్తు అమ్మవారు లక్ష్మిదేవీనే ఏలబోతోందంటూ గ్రామస్థులు సంబర పడుతున్నారు.