News July 8, 2025

ముమ్మిడివరం: గుట్కా అమ్మకాలపై పోలీసులు తనిఖీలు

image

జిల్లా ఎస్పీ ఆదేశాలతో ముమ్మిడివరంలో మత్తు పదార్ధాలు, సిగరెట్స్, గుట్కా, అమ్మకాలపై మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముమ్మిడివరం CI మోహనకుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ జ్వాలా సాగర్ సిబ్బందితో బడ్డిషాపులు, టీ పాయింట్లలో తనిఖీలు జరిపారు. పలు షాపుల యజమానులకు జరిమానాలు విధించారు. మత్తు పదార్థాలు విక్రయించేవారికి పుట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News July 8, 2025

యుద్ధప్రాతిపదికన సీసీఆర్సీ పంపిణీ జరగాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో యుద్ధప్రాతిపదికన సీసీఆర్ కార్డులు పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల గుర్తింపు కార్డులు పంపిణీ, బిందు సేద్యం, సేంద్రియ వ్యవసాయం, గొర్రెలు, చేపల పెంపకంపై రైతులు, పోషకులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ విధులపై నిర్లక్ష్యం వహించవద్దన్నారు.

News July 8, 2025

నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే కారణం: NDMA

image

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో ప్రమాదానికి నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని NDMA బృందం తేల్చింది. ఇవాళ ఘటనా స్థలంలో పరిశీలన చేపట్టిన బృంద సభ్యులు పేలుడుకు గల కారణాలపై అధ్యయనం చేశారు. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 44 మంది మరణించిన విషయం తెలిసిందే. ఘటన జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.

News July 8, 2025

అమలాపురం: పీజీఆర్ఎస్ అర్జీలపై సమీక్ష

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై జాయింట్ కలెక్టర్ శాంతి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. వినతుల పురోగతిపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రజలను సంతృప్తి పరిచే విధంగా పరిష్కారం ఉండాలని అధికారులను ఆదేశించారు