News February 3, 2025

ముమ్మిడివరం: పోలీసుల వేధింపులతో ఆత్మహత్య?

image

ముమ్మిడివరం: గేదెల్లంకకు చెందిన శివరామకృష్ణ (32) ఆత్మహత్య కలకలం రేపింది. శనివారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ముమ్మిడివరం ఎస్సై జ్వాలాసాగర్ కేసు నమోదుచేశారు. శివరామకృష్ణకు 11 నెలల క్రితం పెళ్లయింది. మృతుడు HYD ఎల్బీనగర్లో ప్రూట్ జ్యూస్ దుకాణం నిర్వహించేవాడు. ఎల్బీనగర్‌లోని ఓ కానిస్టేబుల్ భార్య అదృశ్యంలో ఇతని పాత్ర ఉందని వేధించడమే ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Similar News

News February 20, 2026

తిరుపతి: లా సెట్‌కు నోటిఫికేషన్ విడుదల

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV) ఏపీ లా సెట్ (AP LAWCET)–2026, ఏపీ పీజీ లా సెట్ (AP PGLCET)–2026 ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులకు చివరి తేది మార్చి 12.

News February 20, 2026

నెల్లూరు: 5రోజుల్లోనే రైతులకు డబ్బుల జమ

image

నెల్లూరు జిల్లాలో శనగ పంటను క్వింటాల్‌కు ₹5,875 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2వ తేదీ లోపు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. తేమ శాతం 14% లోపు ఉన్న పంటను మాత్రమే సేకరిస్తామని, విక్రయించిన 5 రోజుల్లోనే నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8978381839 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

News February 20, 2026

ములుగు: పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

image

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి వీరేందర్ అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశమయ్యారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. తాగునీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.