News February 28, 2025
ముమ్మిడివరం: రోడ్డు ప్రమాదం.. యువకుల వివరాలు ఇవే..

ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ముమ్మిడివరం మండలం బూరుగుపేటకు చెందిన మట్ట ఆకాశ్‌రెడ్డి (21), ముమ్మిడివరానికి చెందిన అభి(19) అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం రాత్రి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి యానం వెళ్లి వస్తుండగా ఆగి ఉన్న లారీని కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News July 9, 2025
మెదక్: ‘మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే లక్ష్యం’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, మహిళా సంఘ సభ్యులతో కలిసి సంబరాలు ప్రారంభించారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీపీఎం యాదయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి మురళి, కళాకారులున్నారు.
News July 9, 2025
ఉల్లాస్-అక్షరాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్-అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బంగ్లాలో జిల్లాస్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 100 గంటల శిక్షణతో ఈ ఏడాది 97,200 నిరీక్షరాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ సూచించారు.
News July 9, 2025
అల్లూరి జిల్లాలో అరుదైన ఎగిరే ఉడుత

జీకేవీధి మండలం పారికల గ్రామంలో పాంగీ చందు అనే గిరిజనుడు బుధవారం ఉదయం చేను దున్నేందుకు వెళ్లగా అక్కడ చనిపోయిన ఎగిరే ఉడత కనిపించింది. ఉడతను గ్రామంలోకి తీసుకురాగా చూసేందుకు ప్రజలు గుమిగూడారు. వాడుక భాషలో మనుబిల్లి అని పిలుస్తారని స్థానికులు వెల్లడించారు. ఎగిరే ఉడత (ఫ్లయింగ్ క్విరిల్) ఏజెన్సీ గ్రామాలలో కనిపించడం చాలా అరుదని, ఎక్కడి నుంచో ఎగిరి వెళ్తూ పడిపోయి చనిపోయిందని భావిస్తున్నారు.