News September 9, 2025

ముమ్మిడివరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ముమ్మిడివరం మండలం ఠాణేలంక వెళ్లే ప్రధాన రహదారిపై రాజుపాలెం వద్ద కొబ్బరి డొక్కలలోడుతో వెళ్తున్న హైచర్ లారీ కింద పడి వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. ముందుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో బైక్ అదుపుతప్పి లారీ కింద పడినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు కూనలంక గ్రామానికి చెందిన కొప్పిశెట్టి గంగరాజు (46)గా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 9, 2025

భద్రాద్రి డీఈవోగా విద్యా చందన

image

భద్రాద్రి జిల్లా విద్యాధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె జిల్లా విద్యా విభాగానికి సంబంధించిన పరిపాలనా, పర్యవేక్షణా కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. అలాగే పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉపాధ్యాయుల పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై ఆమె పర్యవేక్షణ చేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News September 9, 2025

రంగారెడ్డిలో Sep17 నుంచి ‘అతివ ఆరోగ్యమస్తు’

image

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అతివ ఆరోగ్యమస్తు’ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్నామని DM&HO వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని, సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజు 10 ఆరోగ్య క్యాంపులు స్పెషలిస్టు వైద్యులతో మహిళ ఆరోగ్య సంరక్షణకు స్క్రీనింగ్ చేస్తామన్నారు.

News September 9, 2025

సంగారెడ్డి: విద్యార్థులకు తక్షణమే వైద్యం అందించాలి: మంత్రి

image

మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనలో ముగ్గురు (3) విద్యార్థులు స్వల్ప గాయాల పాలైన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటన జరిగిన గురుకుల పాఠశాలను పరిశీలించాలని కలెక్టర్ ప్రావీణ్యకు ఆదేశించారు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయట పడిన విద్యార్థులకు తక్షణమే వైద్య చికిత్సలు అందించాలన్నారు.