News March 8, 2025

ముమ్మిడివరం: వివాహితపై కత్తితో దాడి

image

ముమ్మిడివరం మండలం అనాతవరం ఎదురుమూడి పుంతకు చెందిన మాలతిపై అదే ప్రాంతానికి చెందిన జయరామకృష్ణ శనివారం కత్తితో దాడి చేశాడు. మాలతి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో చుట్టుపక్కల పిల్లలు అల్లరి చేస్తుండగా ఆమె వారిని మందలించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న జయరామకృష్ణ కోపంతో కత్తితో మాలతిపై దాడి చేశాడు. ఆమె అపస్మారక స్థితికి చేరడంతో అమలాపురం ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఎస్ఐ జ్వాలా సాగర్ కేసు నమోదు చేశారు.

Similar News

News February 23, 2026

మైనర్, డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు: జగిత్యాల ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలో రోడ్డు భద్రతకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మైనర్, డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి అవసరమైతే లైసెన్సులు రద్దు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హెల్మెట్ ధారణపై కఠిన అమలు చేస్తున్నామని అన్నారు.

News February 23, 2026

సిరిసిల్ల: 25మందికి లైసెన్స్ పత్రాలు

image

జిల్లాలో ఉత్తీర్ణత సాధించిన 25 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి సోమవారం లైసెన్స్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఐడీఓసీ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 25 మందికి పత్రాలు అందజేశారు.

News February 23, 2026

అధికారులు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్

image

భూపాలపల్లి జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కాలంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.