News January 3, 2026
మురుగు నగరానిది.. కన్నీరు నల్గొండది..!

హైదరాబాద్ మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలతో మూసీ నది కాలుష్య కాసారంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలుష్యం చివరగా నల్గొండ జిల్లాకు చేరుతుండటంతో అక్కడ పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడుతుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని, నల్గొండ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన చేస్తానన్న ప్రభుత్వ నిర్ణయంపై మీ కామెంట్.
Similar News
News January 4, 2026
జనవరి 4: చరిత్రలో ఈరోజు

* 1643: శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్(ఫొటోలో లెఫ్ట్) జననం
* 1809: బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయీ బ్రెయిలీ జననం
* 1889: భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి జననం
* 1945: నటుడు, దర్శకుడు ఎస్.కె.మిశ్రో జననం
* 1994: సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్ మరణం
* 2015: నటుడు ఆహుతి ప్రసాద్ మరణం
– ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం
News January 4, 2026
మార్కాపురం జిల్లాలో మొదటిసారి పరిష్కార వేదిక

మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ రాజాబాబు శనివారం తెలిపారు. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గ ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కాపురం జిల్లాకు సంబంధించిన అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. 5వ తేదీ జరగవలసిన రెవెన్యూ క్లినిక్ వాయిదా వేశామన్నారు.
News January 4, 2026
వెనిజులాలోని భారతీయులకు MEA హెచ్చరిక

వెనిజులాలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరికలు చేసింది. అత్యవసరం కాకపోతే ఆ దేశానికి ప్రయాణాలు మానుకోవాలంది. ఇప్పటికే వెనిజులాలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, బయట తిరగొద్దని కోరింది. సాయం కావాల్సినవారు cons.caracas@mea.gov.in, అత్యవసర ఫోన్/వాట్సాప్ నంబరు(58-412-9584288)ను సంప్రదించాలంది. భారతీయులందరూ కరాకస్‌లోని ఎంబసీతో టచ్‌లో ఉండాలని విన్నవించింది.


