News December 18, 2025
ముర్రా జాతి గేదెల ప్రత్యేకతలు ఇవే

ముర్రా జాతి గేదెలు హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు చెందినవి. వీటి శరీరం ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా V(వీ) ఆకారంలో ఉంటుంది. దీని వల్ల ఇవి తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ పాలను ఇస్తాయి. ఒక ముర్రా గేదె రోజుకు 14 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. మేలైన జాతి గేదెలు రోజుకు 25-30 లీటర్ల వరకు పాలు ఇచ్చే ఛాన్సుంది. ఒక ఈత కాలంలో ఇవి సుమారు 270-300 రోజులు పాలు ఇస్తాయి. పాలలో వెన్న 7 నుంచి 9 శాతంగా ఉంటుంది.
Similar News
News December 18, 2025
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో చలి, పొగమంచు తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలు ఉదయం బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. TGలో 2-3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు YELLOW ALERT ఇచ్చింది. అటు APలోని మన్యంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి.
News December 18, 2025
OG కోసం సొంత కారు అమ్మిన డైరెక్టర్!

డైరెక్టర్ సుజీత్‌కు హీరో పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ ఇచ్చిన <<18579913>>విషయం<<>> తెలిసిందే. ఆ కారును పవన్ గిఫ్ట్‌గా ఎందుకిచ్చారో సినీవర్గాలు తెలిపాయి. ‘OGలోని కొన్ని సీన్లు జపాన్‌లో షూట్ చేద్దామనుకుంటే బడ్జెట్ వల్ల నిర్మాత ఒప్పుకోలేదు. ఈ సీన్ ప్రాధాన్యం దృష్ట్యా సుజీత్ తన కారు అమ్మేసి షూట్ పూర్తిచేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్.. అదే మోడల్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు’ అని పేర్కొన్నాయి.
News December 18, 2025
ముంబై ‘జుగాడ్’.. జనం మెచ్చిన ఐడియా!

పైనున్న ఫొటో చూసి అవాక్కయ్యారా? ముంబైలో ఆకాశాన్నంటుతున్న అద్దెలను తట్టుకోలేక 20 మందికి పైగా వైద్యులు కలిసి ఇలా ఒకే చిన్న గదిని క్లినిక్‌గా మార్చుకున్నారు. ఒకేసారి అందరూ ఉండకుండా షిఫ్టుల వారీగా ఒకరి తర్వాత ఒకరు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఆ చిన్న గదే ఇప్పుడు అన్ని రకాల వైద్యులు దొరికే ‘మల్టీ స్పెషాలిటీ’ హాస్పిటల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో SMలో వైరల్ అవుతోంది.


