News February 27, 2025

ములకలచెరువులో పోక్సో కేసు నమోదు

image

ములకలచెరువు పోలీసులు మైనర్ బాలికను ఆటోలో తీసుకెళ్లి అదృశ్యం చేసిన నిందితుడిపై పోలీసులు పోక్సోకేసు నమోదు చేశారు. ములకలచెరువు మండలం బురకాయల కోటకు చెందిన ఆటో డ్రైవర్ కొలిమి శ్రీకాంత్(27) బురకాయలకోట-ములకలచెరువుకు ఆటో నడుపుకునే వాడు. ఈ క్రమంలో ఓ గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని తీసుకెళ్లిపోయాడు. ఈ మేరకు విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పొక్సో కేసు నమోదైంది.

Similar News

News February 25, 2026

27న అనంతపురం అభివృద్ధిపై సీఎం సమీక్ష

image

సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 27న అనంతపురం పార్లమెంట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్‌తో మాట్లాడి శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ప్రజాప్రతినిధులు ఇప్పటికే సిద్ధమయ్యారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈ కీలక భేటీ కొనసాగనుంది.

News February 25, 2026

కాకినాడ కవయిత్రి సుమశ్రీకి ‘మహిళా కీర్తిరత్న’ పురస్కారం

image

కాకినాడకు చెందిన ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యాయురాలు భూపతి సుమశ్రీ ‘మహిళా కీర్తిరత్న’ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. సవ్యసాచి గ్రూప్ ఆఫ్ ఇండియా, శ్రీశ్రీ కళావేదిక సంయుక్తంగా నిర్వహించే 2026 మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఆమె సాహిత్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రతిభా పురస్కారం పట్ల సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ సుమశ్రీని అభినందించారు.

News February 25, 2026

సత్తా చాటిన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు

image

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పరుగు పందెంలో ఎమ్మెల్యే గద్దె ప్రథమ స్థానం సాధించగా, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. వాలీబాల్‌లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రొఫెషనల్ ప్లేయర్‌లా అదరగొట్టగా.. కబడ్డిలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రత్యర్థులను ఉడుంపట్టుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.