News November 26, 2025

ములకలచెరువు: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

అన్నమయ్య జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ నరసింహ వివరాల మేరకు.. కదిరి వైపు నుంచి వస్తున్న కారును ములకలచెరువు మండలం వేపూరికోట వద్ద ఓ లారీ ఢీకొట్టింది. కారులోని ఇద్దరు చనిపోయారు. మృతులు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన వెంకటరమణ, రాజశేఖర్‌గా గుర్తించారు. లారీ మదనపల్లె వైపు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Similar News

News November 26, 2025

వరంగల్: మహిళా చైతన్యం వెల్లివిరిసేనా..?

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా మహిళా చైతన్యం వెళ్లి విరుస్తుందా అని పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 2013 ఎన్నికల్లో పర్వతగిరి(మం) చౌటపల్లి గ్రామంలో సర్పంచ్, ఉపసర్పంచ్, సహా వార్డు సభ్యులంతా పూర్తిగా మహిళలనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పట్లో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలు కూడా మహిళలే కావడంతో రాష్ట్రం చూపు చౌటపల్లిపై పడింది. ప్రస్తుతం ఏదైనా గ్రామ పాలకవర్గమంతా మహిళలకే ప్రాధాన్యత ఇస్తారా వేచి చూడాల్సిందే.

News November 26, 2025

సిద్దిపేట: పల్లెపోరు.. రేపటి నుంచి నామినేషన్స్

image

సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సగారా మోగింది. రేపటి నుంచి ఈనెల 29 వరకు మెదటి విడత నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలోని 23 మండలాల్లో 508 గ్రామాలు, 4508 వార్డులు ఉన్నాయి. మొత్తం 6,55,958 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,21,766, మహిళలలు 3,34,186, ఇతరులు 6 మంది ఉన్నారు. ఎన్నికలు మూడు విడతల్లో జరగనుండగా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ డిసెంబర్ 17 వరకు అమలులో ఉంటుంది.

News November 26, 2025

JGTL: ఊరురా అమల్లోకి CODE.. జాగ్రత్త గురూ..!

image

గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ మొదలైంది. జిల్లా, గ్రామ రహదారులపై పోలీసు వాహన తనిఖీల్లో రూ.50వేలు మించిన నగదును సరైన ఆధారాలను చూపకపోతే జప్తు చేయనున్నారు. రైతులు, వివాహాది శుభకార్యాలకు ఉపయోగించే నగదు లావాదేవీలకు సరైన రశీదులను వెంట తీసుకెళ్లాలి. ఎన్నికల కోడ్‌ పట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే తనిఖీల్లో డబ్బులు ఎన్నికల కమిషన్‌కు వెళ్లిపోతాయి. జర జాగ్రత్త గురూ.