News February 12, 2025

ములకలచెరువు: రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం మృతి

image

రోడ్డుప్రమాదం ఓ కుటుంబం మొత్తాన్ని కబళించింది. ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె ప్రశాంతనగర్‌కు చెందిన భార్యాభర్తలు, పిల్లలు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తప్పు ఎవరిదైనా ప్రమాదంలో నాలుగు ప్రాణాలు పోవడం తీరని విషాదం. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. డ్రైవింగ్ చేసే ముందు మనకూ ఒక కుటుంబం ఉందని గుర్తించండి.

Similar News

News November 9, 2025

ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

image

<>ఎయిమ్స్ <<>>మంగళగిరి 10 నాన్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం హార్డ్ కాపీని డిసెంబర్ 10 వరకు పంపాలి. సీనియర్ ప్రోగ్రామర్, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్, బయో మెడికల్ ఆఫీసర్, లా ఆఫీసర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in

News November 9, 2025

అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

image

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.

News November 9, 2025

GWL: టీబీ డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు క్రాఫ్ హాలిడే..!

image

తుంగభద్ర డ్యామ్‌కు కొత్త గేట్లు అమర్చేందుకు డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు ఈ ఏడాది రబీ లో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ విషయమై ఇటీవల కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే గతేడాది డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోగా స్టాప్ లాక్ గేట్ అమర్చారు. ఇంజినీరింగ్ నిపుణుల ఆదేశం మేరకు 33 కొత్త గేట్లు అమర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.