News December 2, 2024
ములుగులో ఎన్కౌంటర్.. మృతుల్లో పెద్దపల్లి వాసి..!
ములుగు జిల్లాలో ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌కు చెందిన ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి(43)ఉన్నారు. కాగా, వారి మృతదేహాలు ములుగు జిల్లా ఏటూరునాగారం ఆసుపత్రిలో ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.
Similar News
News December 26, 2024
దేనికి బేష్? దేనికి శభాష్?: బండి సంజయ్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించిందని రాహుల్ గాంధీ ‘ప్రజాపాలన బేష్’ అంటూ వ్యాఖ్యానించారో చెప్పాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదన్నారు. గ్యారెంటీలను అమలు చేయని ప్రభుత్వానికి ‘దేనికి బేష్? దేనికి శభాష్?’ అని ప్రశ్నించారు.
News December 26, 2024
ఎర్రోళ్ల అక్రమ అరెస్టు దుర్మార్గమైన చర్య: కేటీఆర్
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని సిరిసిల్ల MLA, మాజీ మంత్రి KTR అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
News December 26, 2024
KNR: ఆన్లైన్ మోసాలకు బలవుతున్న అమాయకులు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆన్లైన్ మోసాలకు అమాయకులు బలవుతున్నారు. బెట్టింగ్, ఇన్వెస్ట్మెంట్, గేమింగ్ లాంటి మోసపూరితమైన ప్రకటన చూసి అందులో అధిక డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో మొబైల్లో వచ్చిన లింకులను ఓపెన్ చేసి అందులో డబ్బులు పెడుతున్నారు. చివరకు మోసపోయామని తెలిసి మిగతా జీవులుగా మారుతున్నారు. మొబైల్లో వచ్చే లింకులు, యాప్ లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.