News March 6, 2025
ములుగులో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష

ములుగు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్షిక పరీక్షల ఏర్పాట్లపై విద్యా, రెవెన్యూ, పోలీస్, వైద్య, పోస్టల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షలు జరుగుతాయన్నారు. 21 సెంటర్లలో మొత్తం 3,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
Similar News
News September 17, 2025
WGL: పసుపు క్వింటా రూ.10,555

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పలు రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,530 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.,4500 ధర పలికింది. అలాగే మక్కలు (బిల్టీ)కి రూ.2,300 ధర వచ్చింది. మరో వైపు దీపిక మిర్చి క్వింటా రూ.14 వేలు, పసుపు రూ.10,555 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
News September 17, 2025
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మోడల్స్ ప్రదర్శన

విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు జరిగే 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌లో, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) యొక్క సూక్ష్మ నమూనాలను APCRDA ప్రదర్శించనుంది. ప్రజలు భవిష్యత్తులో నిర్మించబోయే ఈ కాంప్లెక్స్‌ను ప్రత్యక్షంగా చూసి అనుభూతి పొందేందుకు వీలుగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు సీఆర్డీఏ తెలిపింది.
News September 17, 2025
అమరావతి మినియేచర్ మోడల్స్ సందర్శించే అవకాశం

రాజధానిలో నిర్మించే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC) సూక్ష్మ నమూనాలను(మినియేచర్ మోడల్స్) ప్రజల సందర్శనార్ధం ప్రదర్శించనున్నారు. ఈ నెల 19 నుంచి 21 వరకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌లో వీటిని ప్రదర్శిస్తామని CRDA కమిషనర్ కార్యాలయం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు, HOD టవర్స్ మినియేచర్ మోడల్స్ ఈ కార్యక్రమంలో ప్రజలు సందర్శించవచ్చని CRDA పేర్కొంది.