News February 13, 2026
ములుగులో మున్సిపాలిటీలో ఖాతా తెరిచిన బీజేపీ

ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్‌కి 154 ఓట్లు, బీఆర్ఎస్‌కు 173 ఓట్లు, బీజేపీకి 211 ఓట్లు లభించాయి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఒక ఓటు నమోదు కాగా, నోటాకు 2 ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి కొత్త సురేందర్ అత్యధిక ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు.
Similar News
News February 14, 2026
HYD విశాఖ వెళ్లేవారికి గమనిక.. టైమింగ్ ఛేంజ్

సిటీ నుంచి వైజాగ్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు రెగ్యులర్‌గా నడుస్తోంది. లింగంపల్లి- విశాఖ (12806) ఉ.6:55 గం.కు బయలుదేరి విశాఖకు రాత్రి 7:50కు చేరుకుంటుంది. విశాఖ- లింగంపల్లి (12805) రైలు విశాఖలో 6:20 గం.కు బయలుదేరి లింగంపల్లికి రాత్రి 7:15 గం.కు చేరుకుంటుంది. ఈ మార్పులు రేపటి నుంచి అమలవుతాయి.
News February 14, 2026
స్టైలింగ్ ఇలా మార్చుకోండి

చాలామంది అమ్మాయిలు ఫేస్ చేసే సమస్య ఎన్ని దుస్తులున్నా వేసుకోవడానికి ఏవీ లేవనేది వారి బాధ. కొత్త బట్టలు కొనకుండా స్టైలింగ్ కాస్త మారిస్తే మీ వార్డ్‌రోబ్ కొత్తగా కనిపిస్తుంది. ఉన్నవాటినే రంగులూ, డిజైన్ల వారీగా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. ట్రెండీ దుస్తులు కాకుండా మీ ఒంటి తీరుకు ఏవి నప్పుతాయో చూసుకోండి. మీకంటూ ఓ స్టైల్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీరేం వేసినా అందంగా కనిపిస్తారు.
News February 14, 2026
స్టే.ఘ: పదిలో ఒక్కడు!

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీకి ఈనెల 11న ఎన్నికలు జరగగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు పక్రియ ముగిసింది. కాగా, మున్సిపల్ కేంద్రంలోని 10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయగా.. మొదటి వార్డు అభ్యర్థి తాటికొండ మధు విజయం సాధించి, పదిమందిలో ఒకడిగా నిలిచాడు.


