News March 20, 2025
ములుగు: అటవీశాఖలో అవినీతి అధికారి

తునికాకు కూలీల బోనస్ డబ్బుల్లో చేతివాటం ప్రదర్శించిన అటవీశాఖ రేంజ్ అధికారిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బందితో పాటు పలువురి ఖాతాల్లో సుమారు రూ.25లక్షల మేర అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఏడుగురు అమాయక సిబ్బందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. బోనస్ డబ్బులు ‘బా’గానే ‘లా’గి ‘రాజు’ల తిరుగుతున్నాడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 6, 2025
సమగ్ర వ్యవసాయ విధానాలు (మోడల్స్)

☛ పంటలు + పశువులు +జీవాల పెంపకం.
☛ పంటలు + పశువులు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపల పెంపకం
☛ పంటలు + పశువులు + కోళ్లు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపలు + పుట్టగొడుగుల పెంపకం
☛ పంటలు + పశువులు + వర్మీ కంపోస్ట్ + చేపల పెంపకం
☛ పశువులు+ జీవాలు + కోళ్ల పెంపకం.. వాతావరణం, రైతు స్థితి, సహజ వనరులను బట్టి <<18185953>>సమగ్ర వ్యవసాయ<<>> అనుబంధ రంగాలను ఎంచుకోవచ్చు.
News November 6, 2025
అధికారులకు ప్రకాశం కలెక్టర్ సూచనలు

లోప రహిత ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా ఇప్పటినుంచే దృష్టిసారించాలని ప్రకాశం కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. ఈ దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఈఆర్వోలను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఒంగోలు నుంచి కలెక్టర్ హాజరయ్యారు.
News November 6, 2025
ఓటేసేందుకు బిహారీల పాట్లు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ కోసం తెలుగు రాష్ట్రాల్లోని బిహారీలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. HYDలో 10-12 లక్షల మంది బిహారీలు ఉండగా AP, TGలో కలిపి ఈ సంఖ్య 15 లక్షల మందికి పైగానే ఉంటుంది. ఇవాళ, NOV 11న పోలింగ్ కోసం ఇప్పటికే ట్రైన్ టికెట్స్ బుక్ అయి వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. రైల్వే శాఖ 12వేల స్పెషల్ సర్వీసులు నడుపుతామని ప్రకటించినా రియాల్టీలో కన్పించక ఓటర్లు కష్టాలు పడుతున్నారు.


