News January 7, 2025

ములుగు అడవుల్లోనే కెమెరాకు చిక్కిన పులి

image

వెంకటాపురం సమీప అడవుల్లో నెల రోజుల క్రితం పెద్దపులి సంచరించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సుమారు నెలరోజుల పాటు వివిధ జిల్లాల అటవీ ప్రాంతంలో పులి సంచారం కొనసాగించింది. జనవరి 1న ములుగు జిల్లాలోని లింగాల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాకు పులి సంచారం చిక్కింది. మళ్లీ అవే ట్రాప్ కెమెరాలకు మరోసారి పెద్దపులి సంచారం కనిపించింది. దీంతో జిల్లాలోనే పులి ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 8, 2025

WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర క్రమంగా, స్వల్పంగా తగ్గుతూ వస్తున్నది. మక్కలు(బిల్టీ) క్వింటాకు గతవారం రూ. 2570 పలకగా.. సోమవారం, మంగళవారంలు రూ.2,565 ధర పలికాయి. ఈరోజు మరింత తగ్గి రూ.2560 పలికింది. అలాగే కొత్త తేజ మిర్చికి నిన్న రూ.14,500 ధర రాగా నేడు రూ.14,900 పలికింది. కొత్త 341 రకం మిర్చికి నిన్నటి లాగే రూ. 14 వేలు పలికింది.

News January 8, 2025

12న పాకాలలో బర్డ్ వాక్

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల అభయారణ్యంలో ఈ నెల 12న బర్డ్ వాక్ నిర్వహించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన 50కి పైగా రకాల పక్షులు ఏటా చలికాలంలో పాకాల అభయరణ్యానికి అతిథులుగా వస్తుంటాయి. వేసవి ముందు తిరిగి వాటి ప్రాంతాలకు వెళ్ళిపోతుంటాయి. వాటిని వీక్షించేందుకు బర్డ్ వాక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 10 వరకు పేర్లను నమోదు చేసుకోవాలని వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్లు తెలిపారు.

News January 8, 2025

వరంగల్: ZPTC, MPTC ఎన్నికలపై సన్నద్ధం!

image

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగనున్న నేపథ్యంలో ZPTC, MPTC ఎన్నికలపై అధికారులు ముందస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్స్ ఆయా జిల్లాలకు చేరినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో 79 ZPTC, 1075 MPTC స్థానాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా ఆశావహులు ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.