News December 30, 2025
ములుగు అడవుల్లో జంట పులుల సంచారం..!

ములుగు అడవిలోకి సోమవారం పెద్దపులి సంచారం కలకలం రేపగా మంగళవారం మరో పులి పాద ముద్రలు ఆందోళన కలిగిస్తున్నాయి. ములుగు మండలం అబ్బాపురం వద్ద పంట పొలాల్లో పులి అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. ఆడ పులి అడుగులుగా నిర్ధారించారు. నిన్న వచ్చిన మగ పులి సర్వాపూర్ నుంచి పాకాల వైపునకు వెళ్తుండగా దానిని ఆడ పులి అనుసరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ రెండు పంట పొలాల మీదుగా వెళ్తుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Similar News
News December 30, 2025
డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పోచంపల్లి

శాసనమండలిలో BRS డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని BRS అధినేత కేసీఆర్ నియమించారు. BRS అగ్రనేతలకు శ్రీనివాస్ రెడ్డి విధేయుడుగా ఉంటూ రెండు సార్లు వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శ్రీనివాస్ రెడ్డి నడికూడ మండలంలోని వరికోలు గ్రామానికి చెందినవారు.
News December 30, 2025
టీడీపీ జిల్లా అధ్యక్షుడిని కలిసిన గోనుగుంట్ల

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన షేక్ జానీ సైదాను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, పల్నాడు జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన వివిధ అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.
News December 30, 2025
భారత్ విజయం.. సిరీస్ క్లీన్‌స్వీస్

శ్రీలంక ఉమెన్స్ టీమ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను భారత అమ్మాయిలు వైట్‌వాష్ చేశారు. తాజాగా చివరి టీ20లోనూ అదరగొట్టి 15 రన్స్ తేడాతో విజయం సాధించారు. 176 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 160/7 పరుగులకే పరిమితమైంది. భారత జట్టులో దీప్తి, అరుంధతి, స్నేహ్ రాణా, వైష్ణవి, శ్రీచరణి, అమన్‌జోత్ తలో వికెట్ తీశారు.


