News March 18, 2025
ములుగు: అనుమానస్పద స్థితిలో మహిళా మృతి..?

కాటాపూర్ గ్రామానికి చెందిన ఈశ్వరి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన ఈశ్వరి పక్కింటి వారితో గొడవపడ్డారని.. అనంతరం ఆమె ఇంట్లో మృతిచెంది కనిపించిందని తెలిపారు. ఈశ్వరి ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్యనా.? ఆత్మహత్యనా.? అనే కోణంలో విచారిస్తున్నారు.
Similar News
News December 19, 2025
అమిత్ షాతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పురోగతి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను వివరించారు. అంతకుముందు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం.. అమరావతి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని, హైవే నెట్‌వర్క్‌లతో రాజధానిని కనెక్ట్ చేయాలని కోరారు.
News December 19, 2025
మేడారం పనులపై మంత్రి సీతక్క ఆరా

మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలను శుక్రవారం రాత్రి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. మేడారం దేవాలయం అభివృద్ధి పనులను తరగతి గదిలో పూర్తి చేయాలని గద్దెల పునరుద్ధరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఆలయ ఫ్లోరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
News December 19, 2025
సొసైటీ పాలకవర్గాలు రద్దు.. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు

TG: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు 9 జిల్లాల DCCB పాలకమండళ్లను సైతం తొలగించింది. ఇప్పటికే 2 సార్లు వీటి పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు PACSలకు పర్సన్ ఇన్ఛార్జులను నియమించి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీరిని కొనసాగించాలని పేర్కొంది. త్వరలోనే సొసైటీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.


