News December 9, 2025

ములుగు: అన్ని ఏర్పాట్లు చేయండి: EC

image

సజావుగా పంచాయతీ మొదటి విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. ఎన్నికల నిర్వహణపై హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ దివాకర టిఎస్ పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో 3,834 పంచాయతీలకు, 27,628 వార్డులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. గంట ముందు ఏజెంట్ల సమక్షంలో మాకు పోలింగ్ జరుగుతుందన్నారు.

Similar News

News December 18, 2025

సౌత్‌లో పొల్యూషన్‌ లేదు.. అక్కడ మ్యాచ్‌లు ఆడొచ్చు: శశిథరూర్

image

తీవ్ర పొగమంచు కారణంగా ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దక్షిణాదిలో మ్యాచ్‌లు ఆడొచ్చు. ఎందుకంటే అక్కడ కాలుష్యం, విజిబిలిటీ సమస్య లేదు. అభిమానులు కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఉత్తర భారతంలో మ్యాచ్‌లను ఎందుకు షెడ్యూల్ చేయాలి? బదులుగా సౌత్‌లో నిర్వహించాలి’ అని సూచించారు.

News December 18, 2025

అనకాపల్లి: 19న రాష్ట్రస్థాయి బీచ్ గేమ్స్‌కు ఎంపిక పోటీలు

image

రాష్ట్రస్థాయి బీచ్ గేమ్స్‌కు ఎంపిక పోటీలు ఈనెల 19న విజయవాడ కృష్ణా నది ఒడ్డున నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిణి పూజారి శైలజ తెలిపారు. ఖేలో ఇండియా-2వ విడతలో పురుషులు, మహిళల ఓపెన్ క్యాటగిరి విభాగంలో కబాడీ, వాలీబాల్, సెపక్ తక్ర పోటీలు జరుగుతాయని అన్నారు. విజేతలు జనవరి 5 నుంచి 10 వరకు దాదర్ & నగర్ హవేలీ, డామన్ & డయ్యూలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

News December 18, 2025

షూటింగ్‌లో ప్రమాదం.. హీరో ఆదికి గాయాలు?

image

‘శంబాల’ షూటింగ్‌లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో హీరో ఆది సాయికుమార్ గాయపడినట్లు తెలుస్తోంది. గాయాలతోనే ఆయన షూటింగ్ కంప్లీట్ చేసి ఆస్పత్రికి వెళ్లినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమాకు యుగంధర్ దర్శకత్వం వహిస్తుండగా అర్చన, స్వాసిక, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. DEC 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.