News November 3, 2025
ములుగు: అర్ధరాత్రి భుజాలపై పిల్లలతో వాగు దాటారు!

ములుగు(D) ఏటూరునాగారం(M) కొండాయిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాధరి శేఖర్ దంపతుల ఆరేళ్ల పాపకు తీవ్ర జ్వరం వచ్చింది. తల్లడిల్లిన తల్లిదండ్రులు దొడ్ల-మల్యాల మధ్య జంపన్నవాగులో అర్ధరాత్రి ఒంటిగంటకు తమ ఇద్దరు పిల్లలను భుజాలపై ఎత్తుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగుదాటారు. ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడంతో అర్ధరాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం.
Similar News
News November 3, 2025
VKB: తండ్రికి టాటా చెప్పి.. మృత్యు ఒడికి

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు మండలంలోని ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురు ముస్కాన్ (21) హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సెలవులో ఇంటికి వచ్చిన ఆమె, సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరింది. బస్సు ఎక్కించే తండ్రికి “టాటా” చెప్పి వెళ్లిన ముస్కాన్ ప్రమాదంలో దుర్మరణం చెందింది.
News November 3, 2025
బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ సోమవారం పొక్సో కోర్టు జడ్జి చినబాబు తీర్పు చెప్పారు. తాడిమర్రి మండలం మరువపల్లికి చెందిన అమర్నాథ రెడ్డిపై 2022లో అనంతపురం మహిళా పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాలను కోర్టుకు అందించారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది.
News November 3, 2025
కాలేజీల బంద్ కొనసాగిస్తాం: ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్

TG: కాలేజీల <<18182444>>బంద్<<>> కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్ రమేశ్ నాయుడు అన్నారు. ‘నిరసన ఉద్ధృతం చేస్తాం. రేపటి నుంచి జరిగే డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తాం. మాకు రావాల్సిన బకాయిల్లో సగం వెంటనే విడుదల చేయాలి. NOV 8న HYDలో సభ, 11న 10L మంది విద్యార్థులతో ఛలో HYD పేరుతో నిరసన చేపడతాం. ప్రభుత్వం మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది’ అని ఆరోపించారు.


