News March 1, 2025
ములుగు: ‘ఆయనకు MLC టికెట్ ఇవ్వాలి’

బీసీ కోటాలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు అశోక్‌కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని తాడ్వాయిలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సతీశ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి కోరారు. సామాజిక కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తి అశోక్ అని, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి నిత్యావసర వస్తువులు అందించారని, బీసీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.
Similar News
News September 16, 2025
కేజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

కేజీహెచ్‌లో మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స విజయవంతమైంది. అల్లూరి జిల్లా జి.మాడుగులకు చెందిన ఆడ శిశువుకు తల వెనుక ‘జెయింట్ ఆక్సిపిటల్ మెనింజోఏన్సఫలోసిల్’ గడ్డ ఉంది. కేజీహెచ్‌లో డా. ప్రేమ్‌జిత్ రే నేతృత్వంలోని న్యూరో సర్జరీ బృందం ఆపరేషన్ చేసి, బయటకు వచ్చిన మెదడు భాగాన్ని తొలగించారు. పదివేల మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి చికిత్స విజయవంతమైందని, శిశువు కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.
News September 16, 2025
నర్సాపూర్: ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వద్దకు వెళ్లి వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు పరిశీలించారు, పలు రికార్డులను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సూచించారు.
News September 16, 2025
బందరు: జగన్ ఫోటోతో INCOME సర్టిఫికేట్ జారీ

బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటోతో ఇన్‌కమ్ సర్టిఫికేట్ జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మారినా రాష్ట్రంలో అక్కడక్కడ జగన్ ఫోటోలతో కూడిన సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల గుంటూరులో జగన్ ఫోటోతో సచివాలయ సిబ్బంది సర్టిఫికేట్ జారీ చేయడాన్ని మరువక ముందే నేడు బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో జగన్ ఫోటోతో సర్టిఫికేట్ జారీ విమర్శలకు తావిస్తోంది.