News February 21, 2025

ములుగు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెబ్‌సైట్!

image

ఇందిరమ్మ లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. ములుగు జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.

Similar News

News February 21, 2026

పెండింగ్‌ ఉంటే కుదరదు: గద్వాల్ కలెక్టర్

image

జిల్లాలో భూభారతి దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గద్వాల కలెక్టరేట్‌లో తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో.. జిల్లా వ్యాప్తంగా 1,370 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సంబంధిత మండల అధికారులు తక్షణమే స్పందించి, పెండింగ్‌ ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని స్పష్టం చేశారు.

News February 21, 2026

రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

image

TG: గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం రేపు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGసెట్) జరగనుంది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 492 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. 11AM నుంచి 1PM వరకు ఎగ్జామ్ జరుగుతుందని చెప్పారు. కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని, పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

News February 21, 2026

NGKL: నల్లమల్లలో అరుదైన ‘నక్షత్రపు తాబేలు’ గుర్తింపు.!

image

నల్లమల్ల అటవీ ప్రాంతంలో అత్యంత అరుదైన నక్షత్రపు తాబేలు శుక్రవారం వెలుగుచూసింది. అడవిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యంలో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీడీఏ మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ సాగర్, బ్రహ్మగిరి నుంచి అచ్చంపేట వస్తుండగా రోడ్డుపై భారీ పరిమాణంలో ఉన్న ఈ తాబేలును గుర్తించారు. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న తాబేలును అధికారులు అధికారికంగా గుర్తించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.