News February 13, 2025
ములుగు: ఇసుక అక్రమ రవాణాపై ఎస్పీ నజర్
ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎస్పీ శబరీశ్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాల్లో రుసుము చెల్లించి తవ్వకాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని వాగులు, నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసిన, నిల్వ ఉంచిన చట్ట ప్రకారం జరిమానా, కేసులు నమోదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2025
‘భీముని కొలను’ గురించి తెలుసా?
పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తుండగా ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికారని చరిత్ర చెబుతోంది. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పడంతో గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు దూకాయట. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చిందని అంటారు.
News February 13, 2025
మంగళగిరి: 35 మంది కార్యకర్తలకు ముందస్తు బెయిల్
2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పలు ప్రాంతాలకు చెందిన 35 మంది వైసీపీ కార్యకర్తలపై గుంటూరు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి వైవీఎస్‌బీజీ పార్థసారథి దాడి కేసులో 35 మంది వైసీపీ కార్యకర్తలకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో నిందితుల తరపున వైసీపీ లీగల్ సెల్ వాదించారు.
News February 13, 2025
డోన్‌లో అద్భుత దృశ్యం
డోన్ పట్టణానికి సమీపంలో నూతనంగా నిర్మించిన షిర్డీ సాయిబాబా ఆలయంపై మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు వెలిగిపోతూ దర్శనమిచ్చారు. నేడు సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ క్రమంలో మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు ఆలయానికి వెలుగును ప్రసాదిస్తున్నట్లుగా అరుదైన దృశ్యం కనిపించింది. స్థానికులు ఆసక్తిగా తిలకించి తన ఫోన్లలో బంధించారు.