News December 21, 2025

ములుగు: ఇసుక లారీల ‘చక్రబంధం’.. నరకప్రాయంగా ప్రయాణం

image

ములుగు జిల్లా ధర్మారం-చేరుకురు మధ్య ఇసుక లారీల కారణంగా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. శనివారం ఉదయం నుంచే వందలాది వాహనాలు రోడ్డుపై బారులు తీరడంతో ఉద్యోగులు, ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ లారీల వల్ల రహదారి గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలయమైంది. స్థానిక మెయిన్‌ రోడ్డు అధ్వానంగా తయారవ్వడంతో కనీసం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 22, 2025

పెనమలూరు ORR రూట్ మ్యాప్ ఇదే.!

image

పెనమలూరు పరిధిలో ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డు (ORR)తో అభివృద్ధి వేగవంతం కానుంది. కంకిపాడు-ఉయ్యూరు సరిహద్దులో 25 K.M మేర విస్తరించే ఈ భూసేకరణ కోసం సర్వే నంబర్‌ల గుర్తింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. మారేడుమాక, కోలవెన్ను సహా 8 గ్రామాల్లో 778 కమతాలను గుర్తించారు. దావులూరు-నెప్పల్లి హైవేకు అనుసంధానంగా ఈ రూట్ ఏర్పాటు కానుంది. ORR విస్తరించే గ్రామాల్లో 1st దావులూరు చివరి స్థానంలో రొయ్యూరు ఉన్నాయి.

News December 22, 2025

పాలమూరులో నేడు కొత్త సర్పంచుల పట్టాభిషేకం.!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పాలనలో నూతన అధ్యాయం మొదలుకానుంది. ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,678 పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు నేడు ప్రమాణస్వీకారం చేస్తారు. MBNR 423, NGKL 460, GWL 255, WNP 268, NRPTలోని 272 గ్రామాల్లో సందడి నెలకొంది. అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధులు పాలనా పగ్గాలు చేపట్టేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

News December 22, 2025

వరంగల్: గ్రామ పోరు కిక్కు రూ.307 కోట్లకు పైనే!

image

కొత్త మద్యం షాపులకు పంచాయతీ ఎన్నికలు మంచి గిరాకీ చేశాయి. ఉమ్మడి వరంగల్‌లో 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈనెల 17 వరకు మద్యం అమ్మకాలు పీక్‌కు చేరాయి. ఉమ్మడి జిల్లాలో 294 వైన్స్, 107 బార్ షాపులు ఉండగా, గత 20 రోజుల్లో హనుమకొండలో రూ.99 కోట్ల వ్యాపారం జరిగింది. వరంగల్‌లో రూ.57 కోట్లు, జనగామలో రూ.51 కోట్లు, MHBDలో రూ.53 కోట్లు, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రూ.47 కోట్ల లిక్కర్ అమ్ముడు పోయింది.