News October 8, 2025
ములుగు: ఈ కారు పేరు PSLV c60

వాహనాల ఓనర్లు వాటి వెనకాల రాసుకునే కొన్ని కొటేషన్లు ఫన్నీగానూ, మరికొన్ని ఆలోచింపచేసేలా ఉంటాయి. కానీ, ములుగుకు చెందిన వినయ్ తన కారుపై సందేశాత్మక అక్షరాలను చేర్చాడు. PSLV c60 అని రాసుకున్నాడు. అర్థం కాని చాలామంది గూగుల్ సెర్చ్ చేసి దాని భావం తెలుసుకొని అభినందిస్తున్నారు. మన దేశ అంతరిక్ష ప్రయోగాల విజయంలో ముఖ్య భూమిక పోషించిన రాకెట్ లాంచ్ మిషన్ ఇదే. ప్రయోగం రోజున ఈ కారు కొన్నాడట వినయ్.
Similar News
News October 8, 2025
టాటా గ్రూప్ వివాదాలకు త్వరలో తెర!

టాటా గ్రూపులో తలెత్తిన వివాదాలకు త్వరలోనే తెరపడనుందని సమాచారం. గ్రూపులోని టాటా, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు రాజీకి వస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. టాటా సన్స్‌లోనూ డైరెక్టర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. వీటన్నింటిపై అమిత్ షా, నిర్మల సమక్షంలో చర్చలు జరిగాయి. తీవ్ర ప్రభావం చూపించేలా మారిన విభేదాల్ని వీడాలని వారు స్పష్టంచేశారు. రతన్ టాటా మృతి తర్వాత గ్రూపులో విభేదాలు తలెత్తినట్లు చెబుతున్నారు.
News October 8, 2025
వేములవాడ: 24 గంటల్లో.. 20 ఆపరేషన్లు..!

వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలో 24 గంటల్లో 20 రకాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య తెలిపారు. ఇందులో సాధారణ కాన్పులు 4, ఆపరేషన్లు 9, కంటిఆపరేషన్లు 4, జనరల్ సర్జరీలు 2, ఆర్థో ఆపరేషన్ ఒకటున్నాయి. ఆపరేషన్లు చేసిన వారిలో గైనకాలజిస్ట్ డాక్టర్లు సంధ్య, సోనీ, మాధవి, పిల్లల వైద్యులు సుభాషిణి, చారి, రమణ, ఆర్థోపెడిక్ డాక్టర్ అనిల్, అనిస్థీషియన్లు రాజశ్రీ, తిరుపతి ఉన్నారు.
News October 8, 2025
జయచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు: TDP

నకిలీ మద్యం విషయంలో TDP నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడని TDP ట్వీట్ చేసింది. ‘YCP హయాంలో అతని నకిలీ మద్యం దందా బాగా నడిచింది. తిరిగి 15 రోజుల క్రితమే YCP పెద్దల ఆదేశాలతో మళ్ళీ మొదలుపెట్టాడు. ఎక్సైజ్ శాఖ అప్రమత్తతో ఈ నెట్ వర్క్‌ని బయట పెట్టి అరెస్ట్‌లు చేసింది. దీని వెనుక ఉన్న YCP పెద్దలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.’అని పేర్కొంది.