News December 13, 2025
ములుగు ఉద్యానవర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తులు

కొండాలక్ష్మణ్ ఉద్యానవర్సిటీలో హార్టీకల్చర్ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఏ. భగవాన్ తెలిపారు. ములుగులోని ఉద్యాన కళాశాలలలో ఉద్యాన డిగ్రీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని, B.Sc(ఆనర్స్) ఉద్యాన డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. జయశంకర్ వ్యవసాయవర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్లో కౌన్సెలింగ్ జరుగుతుందని, 9652456779 నెంబరులో సంప్రదించవచ్చన్నారు.
Similar News
News December 16, 2025
ADB: మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ పోలీసులకు చిక్కారు. ఆదిలాబాద్ నుంచి సేఫ్ జోన్‌కు వెళ్తుండగా పోలీసులకు చిక్కినట్లు సమాచారం. పట్టుబడ్డ బడే చొక్కారావుతో పాటు 15 మంది మావోయిస్టులు సిర్పూర్(యూ)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉండగా, మావోయిస్టులను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు.
News December 16, 2025
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: సిద్దిపేట సీపీ

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కేసులు నమోదుకానున్నాయని CP విజయ్‌కుమార్ ప్రకటించారు. విజయోత్సవాల్లో పటాకులు కాల్చడం, అనుమతి లేని ర్యాలీలు నిర్వహించడం, ప్రభుత్వ అధికారుల పనికి ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొదటి దశ ఎన్నికల్లో 20 కేసులు, రెండవ దశలో 13 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
News December 16, 2025
15 బంతుల్లో హాఫ్ సెంచరీ..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ మరోసారి చెలరేగారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. మొత్తంగా 22 బంతుల్లో 73 రన్స్ బాదారు. ఇందులో 7 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. తొలుత రాజస్థాన్ 216/4 స్కోర్ చేయగా, ముంబై 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మరో బ్యాటర్ రహానే 41 బంతుల్లో 72* రన్స్ చేశారు.


