News October 7, 2025
ములుగు: ఎస్టీ వర్గాల మధ్య అంతర్గత చర్చలు..!

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, నిరసనగా లంబాడీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు చేయడం ఇటీవల హాట్ టాపిక్ అయ్యాయి. స్థానిక ఎన్నికల శంఖారావం పూరించిన తర్వాత ములుగు జిల్లాలో ఈ రెండు వర్గాలు సయోధ్య కోసం అంతర్గత చర్చలు జరుపుతున్నాయని సమాచారం. తమ జనాభా ఎక్కువగా ఉన్న చోట తమ వర్గానికే పోటీకి అవకాశం కల్పించాలని, ఇందుకోసం పరస్పరం సహకరించుకోవాలని అనుకున్నారట.
Similar News
News October 7, 2025
మ్యాగజైన్ కంటెంట్.. ఇక ప్రతిరోజూ..

Way2News యునిక్ ఫీచర్లలో ఒకటైన మ్యాగజైన్‌కు విశేష ఆదరణ ఉంది. పాడిపంట, జాబ్స్, భక్తి, వసుధ.. ఇలా వారంలో రోజూ ఒక్కో థీమ్‌తో అందించే కంటెంట్‌ను ప్రతిరోజూ ఇవ్వాలని కొత్తగా కేటగిరీలు తీసుకొచ్చాము. దీంతో మీరు మెచ్చిన కంటెంట్ కోసం వారం రోజులు వేచి చూడకుండా ప్రతిరోజూ చదువుకోవచ్చు. యాప్‌లో కింద భాగంలో కేటగిరీలు క్లిక్ చేసి నేరుగా నచ్చిన కంటెంట్ పొందండి. కేటగిరీలు కన్పించలేదంటే <
News October 7, 2025
GHMC వ్యాప్తంగా ఓపెన్ జిమ్స్ ప్రారంభం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నూతనంగా 30కి పైగా ఓపెన్ జిమ్స్ ప్రారంభించినట్లుగా GHMC అధికారులు తెలియజేశారు. ప్రతి డివిజన్ పరిధిలో ఓపెన్ జిమ్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరూ ఫిట్‌నెస్ కోసం వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మై జీహెచ్ఎంసీ యాప్, GHMC అధికారిక వెబ్‌సైట్‌లో వీటి వివరాలు పొందుపరిచినట్లుగా పేర్కొన్నారు.
News October 7, 2025
సిరిసిల్ల: ‘2.70 MT ధాన్యం వచ్చే అవకాశముంది’

ఈ సీజన్లో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సిరిసిల్ల కలెక్టర్ హరిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఖరీఫ్ సీజన్లో 2.15 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. రైస్ మిల్లర్లు నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. అదరపు కలెక్టర్ నగేష్, అధికారులు ఉన్నారు.