News December 2, 2025

ములుగు: ఎస్సై హరీశ్ మృతి.. నేటికి ఏడాది!

image

ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా పని చేసిన రుద్రారపు హరీశ్ బలవన్మరణానికి పాల్పడిన ఘటనకు నేటికీ ఏడాది. డిసెంబర్ 2న ఆయన ముళ్లకట్ట వద్దనున్న రిసార్టులో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని, మృతి చెందిన సమయంలో తనతో యువతి సైతం రీసార్ట్‌లో పక్కనే ఉండడం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.

Similar News

News April 5, 2026

నేడు ఒంటిమిట్ట రామయ్యకు పుష్పయాగం

image

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగియడంతో నేడు(ఆదివారం) రాత్రి రామాలయంలో వేదపండితులు, అర్చకులు సంప్రదాయంగా పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఆలయంలోని దక్షిణ ఈశాన్య మూల ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ప్రత్యేక చినపుష్పాలతో ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించనున్నారు.

News April 5, 2026

శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు

image

శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రిందట ప్రభుత్వం ఆయన్ను విజయనగరం నుంచి బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తనకు శ్రీకాకుళం జిల్లాలో ఎంపీడీవోగా, ఇతర శాఖలలో పనిచేసిన అనుభవం ఉందని వెంకట్రామన్ పేర్కొన్నారు. జడ్పీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

News April 5, 2026

రత్నమైనా, పద్యమైనా.. విలువ దేనికంటే?

image

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: శ్రేష్ఠమైన నీలి రంగు రత్నం ఒక్కటి ఉన్నా చాలు. దానికి ఎంతో విలువ ఉంటుంది. తళతళ మెరిసే రాళ్లు తట్టెడు ఉన్నా ఉపయోగం లేదు. అలాగే రసవంతమైన, అర్థవంతమైన పద్యం ఒక్కటున్నా చాలు. వేల సంఖ్యలో అర్థం లేని పద్యాలతో మంచి జరగదు.<<-se>>#PADHYAM<<>>