News April 9, 2025

ములుగు కలెక్టర్ పనితీరు అద్భుతం

image

ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర పనితీరు అద్భుతంగా ఉందని ములుగు జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్ అన్నారు. బుధవారం కలెక్టర్ దివాకర జన్మదిన పురస్కరించుకొని కలెక్టరేట్ కార్యాలయంలో రవి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ములుగు జిల్లా అధికార ప్రతినిధి ఎండి అహ్మద్ భాషా, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Similar News

News April 18, 2025

కీవ్‌లో భారత ఫార్మా గోడౌన్‌పై దాడి.. ఉక్రెయిన్‌కు రష్యా కౌంటర్

image

కీవ్‌లో APR 12న భారత ఫార్మా గోడౌన్‌పై దాడి జరగ్గా, దానికి కారణం రష్యా క్షిపణి అని ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా తాజాగా స్పందించింది.
ఉక్రెయిన్ క్షిపణుల వల్లే ఇది జరిగి ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. ఆ దాడి తాము చేయలేదని భారత్‌లోని రష్యా ఎంబసీ స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో రాకెట్ లాంచర్లు, ఫిరంగులు సహా ఇతర సైనిక పరికరాలను మోహరించడం ఉక్రెయిన్‌కు పరిపాటిగా మారిందని మండిపడింది.

News April 18, 2025

ASF జిల్లాలో 8 మందిపై కేసు: వాంకిడి SI

image

మహారాష్ట్ర నుంచి రాజురాంపల్లికు పశువులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు వాంకిడి మండలం అకిని సమీపంలో బుధవారం తనిఖీలు నిర్వహించగా అనుమతులు లేకుండా 4 బులెరో వాహనాల్లో 8 పశువులను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. పశువులను కాగజ్‌నగర్ గోశాలకు తరలించామన్నారు. 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు.

News April 18, 2025

నారాయణపేట: GREAT.. ఫ్రెండ్స్ అంటే వీళ్లే..!

image

నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన వడ్ల బాలరాజు గత నెలలో మృతిచెందాడు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో బాలరాజు మిత్ర బృందం వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతా కలిసి రూ.1.50లక్షలు జమ చేసి బాలరాజు భార్యకు గురువారం రాత్రి అందించారు. ఫ్రెండ్స్ అంతా కలిసి స్నేహితుడి కుటుంబానికి చేయూతనివ్వడంతో గ్రామస్థులు వారిని అభినందించారు.ఆపద సమయంలో అండగా ఉన్నవారే నిజమైన దోస్తులని అన్నారు.

error: Content is protected !!