News July 5, 2025

ములుగు: కాంగ్రెస్ Vs బీఆర్ఎస్

image

ఈ నెల 7న కాంగ్రెస్ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదే 7వ తేదీన జిల్లా కేంద్రంలో పదేళ్లు బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని, ఇద్దరి మృతికి కారణం బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Similar News

News July 5, 2025

అనకాపల్లి: ‘రోజుకు రూ.29 లక్షల ఆదాయం’

image

అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్ ప్రెస్‌లు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డీపీటీవో ప్రవీణ శుక్రవారం తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్స్ ప్రెస్ బస్సులు కాంప్లెక్స్‌కు వచ్చే విధంగా ఈడీతో సంప్రదిస్తామన్నారు. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం బస్సు డిపోల ద్వారా రోజుకు రూ.29 లక్షల ఆదాయం వస్తోందన్నారు.

News July 5, 2025

వరంగల్: విమానం ఎగురేది డౌటే!

image

WGL ఎయిర్పోర్ట్ భూముల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఈఏడాది చివర్లో రన్ వే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్‌కు 696 ఎకరాల భూమి ఉండగా రైతుల నుంచి మరో 253 ఎకరాలు సేకరించాలి. ఎకరాకు రైతులు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం రూ.1.20 కోట్లు ఇస్తామని చెప్పినా వినట్లేదు. సర్వే చేసిన భూముల్లో సాగు చేయవద్దని నోటీసులు ఇచ్చినా రైతులు మాత్రం వానాకాలం సాగు చేస్తున్నారు.

News July 5, 2025

కడప: పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్‌పై విచారణ

image

కడప పరిశ్రమల శాఖలో గతంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన కె.కృష్ణమూర్తిపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కొప్పర్తి పరిశ్రమల అధ్యక్షుడు జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉషశ్రీని విచారణాధికారిగా, ఈశ్వరచంద్‌ను ప్రెజెంటింగ్ అధికారిగా నియమిస్తూ GO జారీ చేసింది.